రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎక్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం విశాఖ‌ను ఎక్జిక్యూటివ్ రాజ‌ధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌక కు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు వెల్ల‌డించారు. డిసెంబర్ 4వ తేదీన‌ ఎక్జిక్యూటివ్ రాజధాని విశాఖలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్ కు నేవీ అధికారులు ఆహ్వానం పంపించారు. అయితే మూడు రాజ‌ధానుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. 

మూడు రాజ‌ధానుల‌ను కొంత‌మంది ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు అయితే మూడు రాజ‌ధానుల అంశానికి పూర్తి వ్య‌తిరేఖంగా ఉన్నాయి. ఇక అమ‌రావ‌తి రైతులు త‌మ ఆంధోల‌నలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. క‌రోనా వేళ చ‌ల్ల‌బ‌డిన అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం మ‌ళ్లీ ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక ఊపందుకుంది. ప్ర‌స్తుతం రైతులు పాద‌యాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేవీ అధికారుల వ్యవహారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: