చైనాలో కరోనా ఉగ్ర రూపం కొనసాగుతోంది. మిగిలిన ప్రపంచంలో కరోనా పెద్దగా ఎక్కడా ఇబ్బంది పెట్టకున్నా తన మాతృభూమి చైనాలో మాత్రం రెచ్చిపోతోంది. ప్రధానంగా ఇండియాలో పెద్దగా ప్రభావం చూపని ఒమిక్రాన్ వేరియంట్ చైనాలో మాత్రం విజంభిస్తోంది. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటివరకు 50 వేలకు పైగా కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. చైనాలో కరోనా పరిస్థితులు తీవ్రంగా, అత్యంత క్లిష్టంగా ఉన్నాయని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ఈ కేసుల్లో  సగానికిపైగా ఒక్క జిలిన్‌ ప్రావిన్సులోనే నమోదు అయ్యాయి. ఇక వీటికి తోడు హాంకాంగ్‌లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.  హాంకాంగ్‌లో పరిస్థితులు దారుణం. నెల రోజులుగా అక్కడ రోజూ 200 కొవిడ్‌ మరణాలు జరుగుతున్నాయి. రోజూ పదివేలకుపైగా కేసులు వస్తున్నతాయి. కరోనా తీవ్రత పెరుగుతున్నా.. డైనమిక్‌ జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామంటోంది చైనా. లాక్‌డౌన్‌లు, భారీ స్థాయిలో పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: