భారత ప్రధాని ఇవాళ హైదరాబాద్‌కు రాబోతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌-ఐఎస్‌బి 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రధాని మోదీప్రసంగిస్తారు. ఈ ఐఎస్‌బిని 2001 డిసెంబర్ 2న ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది దేశంలోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్ లో ఒకటి గా గుర్తింపు పొందింది.


హైదరాబాద్‌లో ఇవాళ ఐఎస్‌బీ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.. రోజంతా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రధాని మోదీ నేరుగా చెన్నై వెళ్తారు. చెన్నైలో 31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే చెన్నైలోని  కొన్ని ప్రాజక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే లైన్లు, సబర్బన్‌ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలను  ప్రధాని ఆవాస్‌ యోజన్‌ అర్బన్‌ ప్రాజక్టులను  ప్రారంభిస్తారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: