తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ  కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు తో సోమవారం రోజున ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేమనివైద్యులు చెప్పారు.

‘‘కార్డియాక్‌ అరెస్టు కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా నిలిచి ఆ ప్రభావం పలు అవయవాల పై పడింది. ఆరోగ్య పరిస్థితిని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మీరాజీ రావు, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌తోపాటు న్యూరో, జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ విభాగాల కు చెందిన 8 మంది వైద్యుల ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు చికిత్సలు అందిస్తున్నాం’’ అని వైద్యులు చెప్పారు.

కార్డియాక్‌ అరెస్టు ప్రభావం కిడ్నీలు, ఊపిరి తిత్తులు, మరికొన్ని అవయవాల పై పడిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కిడ్నీల పనితీరు మెరుగు పరిచేందుకు డయాలసిస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. 20 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభించడం తో ఐసీయూ కు తరలించి వెంటిలేటర్‌ పై చికిత్సను అందించినప్పటి కీ ఆయనను కాపాడ లేకపోయారు.. మంగళవారం ఉదయం 4 గంటలకు తుది శ్వాసను విడిచారు.. ఈ మరణం తో తెలుగు చిత్ర పరిశ్రమ మూగ బొయింది...


పలువురు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన మృత దేహాన్ని ఈరోజు ఫిలిం చాంబర్ లో ఉంచనున్నారు. ఆ కుటుంబం లో వరుస మరణాలతో ఫ్యాన్స్ తీవ్ర దిగ్బ్రాంతి లో ఉన్నారు.. ఏది ఏమైనా మరో నటుడును కోల్పోవడం తో సినీ పరిశ్రమ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన ఎన్నో హిట్ సినిమా లలో నటించారు.. ఎన్నో అవార్డులు అందుకున్నారు.. ఇప్పటికీ ఆయన సినిమాల కు మంచి ఆదరణ ఉండటం విశేషం.. ఈ రోజు సాయంత్రం ఆయన భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: