ఒక నిమ్మకాయలో దాదాపు 83 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది స్కాల్ప్  ను క్లీన్ గా ఉంచడానికి అలాగే హెయిర్ ను హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేసే పదార్థం. మరోవైపు, కొబ్బరినూనె అనేది స్కాల్ప్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది. స్కాల్ప్ పొడిబారడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ హెల్త్ ను మెయింటెయిన్ చేస్తూనే నేచురల్ షైన్ ను కూడా నిలిపి ఉంచుతుంది. రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని వెచ్చటి కొబ్బరినూనెలో కలిపి స్కాల్ప్ ను మసాజ్ చేయాలి. పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఆ తరువాత 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత యాంటీ డాండ్రఫ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి.


స్కాల్ప్ ను వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేయడం తప్పనిసరి. ఆయిలీ స్కాల్ప్ అలాగే డాండ్రఫ్ కలిగినవారికి ఈ ప్రాసెస్ తప్పనిసరి. ఇది నూనెను, డర్ట్ అలాగే డాండ్రఫ్ ను తొలగించేందుకు హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ ను క్లీన్ గా అలాగే హెల్తీగా ఉంచుతుంది. రెండు టేబుల్ స్పూన్స్ సీ సాల్ట్ లో అర నిమ్మ చెక్క నుంచి తీసుకున్న రసాన్ని కలపాలి. అలాగే, ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కలపాలి. నిమ్మకాయ అలాగే సీ సాల్ట్ అనేవి డాండ్రఫ్ పై పోరాడే ఏజెంట్స్ గా పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్ అనేది స్కాల్ప్ లో నేచురల్ ఆయిల్ ను నిలిపి ఉంచుతుంది. ఈ స్క్రబ్ తో స్కాల్ప్ ను సున్నితంగా ఎనిమిది నుంచి పది నిమిషాలపాటు స్క్రబ్ చేయాలి. ఆ తరువాత షాంపూతో వాష్ చేయాలి. ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి ఫాలో ఐతే డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ మీ సొంతమవుతుంది.

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అనేది స్కాల్ప్ లోని పీహెచ్ బాలన్స్ ను మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ లోని అదనపు ఆయిల్ ను తొలగిస్తుంది. డాండ్రఫ్ ను తొలగించడానికి రెండు స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని దాంతో స్కాల్ప్ ను రెండు నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఒక కప్పుడు వాటర్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని తీసుకుని ఈ మిశ్రమంతో హెయిర్ ను రిన్స్ చేయాలి. ఇది స్కాల్ప్ లోని అదనపు నూనెను తొలగిస్తుంది. ఆ తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: