ఈ మధ్యకాలంలో వాతావరణ కాలుష్యం కారణంగా, జుట్టుకు సరిగ్గా ఆయిల్ పెట్టకపోవడం వల్ల, తగిన శ్రద్ధ జుట్టుపై చూపకపోవడం  వల్ల,  తినే ఆహారంలో పోషకాల విలువ తగ్గినప్పుడు తల లో చుండ్రు వచ్చి, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చుండ్రు సమస్య కారణంగా తలలో దురద, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.. అయితే ఇలాంటి సమస్య నుండి బయట పడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి తీరాల్సిందే.. అయితే ఆ చిట్కాలు ఏమిటో..? ఇప్పుడు తెలుసుకుందాం..


ఒక కప్పు నీటిలో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా గుజ్జును తీసుకుని, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు పట్టించి, బాగా మర్దన చేయాలి. 40 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో తలస్నానం చేస్తే, కొద్దిరోజుల్లోనే ఫలితాన్ని గమనించవచ్చు.


నారింజ పండు తొక్కలు బాగా మెత్తగా నూరి,ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట సేపు ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు నుండి మూడు సార్లు చేస్తే, చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.


ఇక ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకొని, అందులో కొద్దిగా అరటిపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి,30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గే అవకాశాలు ఎక్కువ.


బేబీ ఆయిల్ ను తలకు పట్టించి,మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ తో చుట్టుకోవాలి. పది నిమిషాల పాటు ఉంచి,ఆ తరువాత తలస్నానం చేస్తే ఫలితం తప్పక లభిస్తుంది.


వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమ భాగాలుగా తీసుకొని, డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాలపాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి . ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: