ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్యంసం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్యంతోపాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలకు చేరువయ్యాయి. మృతుల సంఖ్య లక్షా 9వేల చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 544 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 17,80,287కు చేరింది.

 

ఇవాళ కరోనాతో 43 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,08,822 కు చేరింది.  అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ కొత్త‌గా ఒక్క కేసు నమోదు కాక‌పోవ‌డం గ‌మ నార్హం. . మొత్తం కేసులు సంఖ్య 5,32,879 ఉండగా.. ఇవాళ ఎవరూ చనిపోలేదు.

 

ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 20,577గా ఉంది.  అలాగే స్పెయిన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్పెయిన్ జనజీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పెయిన్‌లో మొత్తం కేసులు 1,63,027. ఇవాళ ఎవరూ చనిపోలేదు. ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 16,606 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: