భార‌త్‌లో క‌రోనా వృద్దిరేట్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. దాదాపుగా గ‌త రెండు వారాలుగా 59 జిల్లాల్లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇందులో మ‌రికొన్ని జిల్లాల్లో సుమారు 28 రోజులుగా కూడా కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. ఇందులో మహే (పుదుచ్చేరి), కొడగ్గు (కర్ణాటక), పౌరి గర్హ్వాల్ (ఉత్తరాఖండ్)లో గత 28 రోజులుగా కొవిడ్‌19 కేసులు న‌మోదు కాలేదు. ఇక‌ రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్, పాలి, జామ్‌నగర్, గుజరాత్‌లోని మోర్బి, గోవాలోని ఉత్తర గోవా జిల్లాల‌తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న మ‌రికొన్ని జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క‌టి కూడా కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాలేద‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

భార‌త్‌కు ఇది చాలా మంచి ప‌రిణామ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య‌ 17,656కు చేరుకుంది. వీటిలో 14,255కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 559 మంది చనిపోయారు. 2,842 మంది క‌రోనా వైర‌స్ బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: