ప‌విత్ర రంజాన్ మాసం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది. ముస్లింలు ఉప‌వాస దీక్ష‌లు పాటించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల‌కు జ‌న‌సేన అధినేత‌, హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముస్లింల‌కు ట్విట్ట‌ర్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రార్థ‌న‌ల స‌మ‌యంలో సామాజిక దూరాన్ని పాటించాల‌ని కోరారు. కాగా,  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రంజాన్ మాసంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశాయి. మ‌సీదుల్లో సామూహిక ప్రార్థ‌న‌లు చేయొద్ద‌ని, ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని సూచించాయి. ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇఫ్తార్ విందులు చేసుకోవాల‌ని కోరాయి. ఇదే స‌మ‌యంలో సామాజిక దూరం పాటించాల‌ని కోరాయి.

 

ఇక ఈ మేర‌కు ముస్లింల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వ‌క్ఫ‌బోర్డుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాయి. ప్ర‌భుత్వాలు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన వ‌క్ఫ్‌బోర్డులు ముస్లింల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాయి. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ప‌విత్ర రంజాన్ మాసం ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని అవ‌గాహ‌న క‌ల్పించాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: