ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్ని వ్యవస్థలు స్థంభించిపోయాయి.  ముఖ్యంగా రవాణ వ్యవస్థ నిలిచి పోయింది.  నిత్యం రోట్లపై పరుగులు పెట్టే వాహనాలు ఆగిపోవడంతో దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ పై పడింది.  గత కొంత కాలంగా పాకిస్థాన్ లో కరోనా కేసులు తీవ్రం అవుతూ వస్తున్నాయి.  ఇక మరణాలు కూడా పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

పాక్ లోని ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం, లీటర్ పెట్రోల్ ధరను రూ.20 వరకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని ఆ కథనంలో పేర్కొంది. అయితే ఇది ఎంత వరకు కంటిన్యూ అవుతుందో అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.  అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తో చర్చించిన తర్వాతే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘డాన్‘ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: