ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ సలహాదారుగా త్వరలో ఉమ్మడిరాష్ట్రమాజీ ప్రధానకార్యదర్శి,మాజీ ఎన్నికలసంఘం కమీషనర్ సి.రమాకాంత్ రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వారం రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం పోలవరం ఒప్పంద సలహాదారుగా పని చేస్తున్న సాహూ సేవలను నిలిపివేసింది. 
 
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం సాహూ సేవలను నిలిపివేసిన వారం రోజుల్లోనే రమాకాంత్ రెడ్డిని సలహాదారుగా నియమించుకోవాలని యోచనలు చేయడం గమనార్హం. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గత గురువారం సాహూను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: