యువ‌ర‌త్న నంద‌మూరి అంద‌గాడు బాల‌య్య బాబు 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా మోత మోగుతోంది. రాజ‌కీయ‌, సినిమా రంగాల‌కు చెందిన వారితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు బాల‌య్య‌కు సోష‌ల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. నిన్న‌టి సాయంత్రం నుంచే సోష‌ల్ మీడియా బాల‌య్య‌కు ప‌లువురు శుభాకాంక్షలు చెపుతుండ‌డంతో హోరెత్తుతోంది. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు సైతం బాల‌య్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. 

 

మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గా బాల‌య్య‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఇక టాలీవుడ్ సూప‌ర్ స్టార్ బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం అంటే ఆ క్రేజే వేరు. బాల‌య్య ఎన‌ర్జీని ప‌వ‌ర్ హౌస్‌తో పోల్చిన మ‌హేష్ బాబు ఆయ‌న‌కు ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వ‌ర్యం క‌ల‌గాల‌ని కోరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: