ఓ వైపు ప్రపంచం మొత్తం కరనా కోరల్లో చిక్కుకొని విల విల విలలాడుతుంది.  మరోవైపు ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు.  భారత్ లో గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోతున్నారో తెలిసిందే. తాజాగా నార్త్‌ కుందూజ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో  తాలిబన్‌ టెర్రరిస్టు బృందాలు సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ మీద దాడి చేశారు. దాడిలో సుమారు ఆరుగురు భద్రతా దళ సభ్యులు మృతి చెందారు.  టోలో న్యూస్‌ కథనం ప్రకారం..ఇమామ్‌ సాహిబ్‌ జిల్లాలో తాలిబన్‌ టెర్రరిస్టు బృందాలు సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ మీద దాడి చేశారు.

 

అదనపు బలగాలు వచ్చే వరకు తాలిబన్ల దాడి కొనసాగింది. ఇక  బలగాలు వచ్చిన తరువాత తాలిబన్లు వెనక్కి తగ్గారు.. దాడి అనంతరం తాలిబన్‌ టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.  అయితే తాలిబన్ టెర్రర్ ఎటాక్ లో ఐదుగురు ఆర్మీ సైనికులు, ఒక పోలీస్‌ మరణించినట్లు తెలిసింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 4గురు తాలిబన్లు కూడా మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: