భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వీవీఐపీల కోసం ఉపయోగించే.. ఖరీదైన, ప్రత్యేక బోయింగ్​ 777 రెండో విమానం భారత్​ చేరింది. ఎయిర్​ ఇండియా వన్‌గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి నిన్న ఉదయం ఢిల్లీలో ల్యాండ్​ అయింది.ఈనెల ఒకటిన తొలి ఎయిరిండియా వన్‌ విమానం.. భారత్‌కు చేరింది.


ఇందులో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. గగనతలంలో ఎలాంటి ఆటంకాలు, హ్యాకింగ్‌ బెడద లేకుండా ఆడియో, వీడియా సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. జంబో విమానం బోయింగ్‌ బి-747ను బి-777గా మార్చి ఎయిరిండియా వన్‌ విమానాన్ని తయారుచేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను వాయుసేనకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: