ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తున్న వేళ ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దుచేయాల‌ని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో ప‌రీక్ష‌ల‌కు సంబంధించి విప‌రీత‌మైన ఒత్తిడి, ఆందోళ‌న నెల‌కొంద‌ని, దాన్ని నివారించాలంటే ప‌రీక్ష‌లు ర‌ద్దుచేయ‌డ‌మే మంచిద‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌ది, ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దుచేసింద‌ని, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింద‌ని గుర్తుచేశారు. అలాగే కేంద్రం కూడా సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దుచేసింద‌న్నారు. రాష్ట్రంలో క‌రోనా టీకా కొర‌త‌గా ఉన్న‌వేళ విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు రాయిస్తే వారి ప్రాణాల‌కు ముప్పువాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని లోకేష్ ఆందోళ‌న వెలిబుచ్చారు. 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంద‌ని, వేచిచూసే ధోర‌ణికంటే ర‌ద్దుచేయ‌డం ఉత్త‌మ‌మ‌ని సూచించారు. రాష్ట్రంలో టీకా సామ‌ర్థ్యం పెరిగే వ‌ర‌కు క‌రోనా నివార‌ణ‌కు మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: