ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసోపేతమైన పని. ఏటా వందల మంది ప్రయత్నిస్తే అతికొద్ది మంది మాత్రమే ఆ శిఖరం పై వరకూ చేరుకోగలుగుతారు. అయితే, కొందరు పర్వతారోహకులు మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (8,848 మీటర్లు) ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. 

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ మహమ్మారి కరోనా సమయంలోనూ.. అత్యున్నత శిఖరమైన ఎవరెస్టు ఎక్కడానికి సాహసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. నేపాల్ లోని ఈ శిఖరానికి కూడా ఇమహమ్మారి కరోనా ఎగబాకింది.  కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఈ శిఖర బేస్ క్యాంపులో కనుగొన్నట్లు.. ఆ వ్యక్తిని హెలికాప్ట్ లో ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించిన్నట్లు..ఒక ప్రముఖ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. నిజానికి ముగ్గురు పర్వతారోహకులకు కోవిడ్ పాజిటివ్ సోకిందని.. వీరిని వెంటనే బేస్ క్యాంపు నుంచి తరలించినట్టు సదరు పత్రిక పేర్కొంది.  అయితే, ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్టు పర్వతంపైకి ఈ వైరస్’ ‘చేరుకోవడం’ అత్యంత ఆశ్చర్యకరం, దారుణం అంటున్నారు పలువురు ప్రముఖులు.  ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడంలేదని, చాలానే ఉంటాయని భావిస్తున్నామని ఓ సాహస యాత్రా బృంద నేత అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: