మిస్‌ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా సొంతం చేసుకున్నారు. 73 మందిని దాటుకొని 26ఏళ్ల మేజా ఈ టైటిల్‌ను గెల్చుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె.. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. 69వ మిస్‌ యూనివర్స్ పోటీలు ఫ్లొరిడాలోని సెమినోలే హార్డ్ రాక్ హాలీవుడ్ హోటల్‌లో ఆదివారం జరిగాయి. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ.. తుది దశలో ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి జొజిబిని తుంజి ఆమెకు కిరీటాన్ని పెట్టారు. కాగా.. మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్‌వాక్‌ పూర్తి చేశారు. మిస్‌ యూనివర్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: