దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల స్పీడును అదుపులోకి తీసుకురావడానికి, ప్రమాదాలను నివారించడానికి ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల వాహనాల వేగంలో పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎం 1 కేటగిరీ పరిధిలోకి వచ్చే కార్లు, జీపులు మరియు ట్యాక్సీల గరిష్ట వేగపరిమితిని కొన్ని ప్రాంతాల్లో గంటకు 70 కి.మీ  చేశారు.

అంతే కాకుండా విమానాశ్రయం, రింగ్ రోడ్డుల వద్ద గంటకు 50 కిమీ కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్లకూడదని పేర్కొన్నారు. అంతే కాకుండా హైవేలపై బైకుల స్పీడ్ గంటకు 50 నుండి 60 కిమీ వేగం మించకూడదని తెలిపారు. అంతే కాకుండా నేషనల్ హైవేలపై గంటకు 60 కిమీ వేగం కంటే మించకూడదని వెల్లడించారు. అంతే కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాల స్పీడ్  గంటకు 20 నుండి 30 కిమీ వేగం కంటే మించకూడదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: