పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని "తగ్గేదే లే" అనే డైలాగ్ గుర్తొస్తుంది. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్ పై 15 పైసలు, పెట్రోల్ పై 25 పైసలు పెరిగింది. ఇక పెరిగిన ధరలతో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే... దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర. 96.66 గా ఉంది. డీజిల్ ధర రూ. 87.41 గా ఉంది. అంతేకాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీని బీట్ చేసింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.46, డీజిల్ ధర. 95.28 గా ఉంది.  విజయవాడలో పెట్రోల్ ధర రూ 102.42, డీజిల్ ధర రూ 96.67 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: