గడచిన 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 42,015 కొత్త కేసు నమోదు అయ్యాయి. అంతేకాకుండా 36,977 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు దేశంలో వందల్లో కేసులు నమోదయ్యాయి. నిన్న 500 మంది కరొనాతో మరణించగా తాజాగా ఈ రోజు ఒక్కసారిగా మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొత్తం 3998 మంది గడిచిన 24 గంటల్లో కరోనాతో మృతిచెందారు.

ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటి శాతం 2.77 గా ఉంది... గత 30 రోజుల నుండి మూడు శాతానికి తక్కువగా పాజిటివిటి రేటు అనేది కనిపిస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో కేసులు మరియు మరణాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను సాధించడంతో ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు. గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. విహార యాత్రకు వెళ్లే వారు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. రాజకీయ సమావేశాలు సైతం  నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులు పెరిగి ఉండవచ్చు అని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: