హైదరాబాదులో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేటలో వర్షం పడుతోంది. అంతేకాకుండా మేహదీపట్నం, నాంపల్లి, మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్ కంటోన్మెంట్ లో కూడా నిన్నటి నుండి వర్షం కురుస్తోంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నాటి నుండి ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇళ్లలోకి కూడా నీళ్ళు వస్తున్నాయి. దాంతో ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అయితే మరో 48 గంటల పాటు కూడా హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: