క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభానికి ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. కొద్దిరోజులుగా అదిగో రాజీనామా, ఇదిగో రాజీనామా అంటున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ఈరోజు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న రోజునే య‌డ్డీ రాజీనామా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా య‌డ్యూర‌ప్ప భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న రాజ‌కీయ జీవితంలో ప్ర‌తిక్ష‌ణం అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కొన‌న్నాని చెప్పారు. కొవిడ్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం స‌వాల్‌తో క‌డుకున్నదైంద‌ని, గ‌తంలో వాజ్‌పేయి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నార‌ని, కానీ క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు ఏదైనా మేలు చేయాల‌న్న ఉద్దేశంతో తాను రాష్ట్రంలో ఉంటాన‌ని చెప్పాన‌ని, క‌న్న‌డ ప్ర‌జ‌ల‌ను తాను ఎంతో రుణ‌ప‌డివుంటాన‌ని య‌డ్డీ అన్నారు. రెండు సంవ‌త్స‌రాల‌పాటు తాను విజ‌య‌వంతంగా ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డానికి కేంద్రం ఎంత‌గానో హ‌క‌రించిందంటూ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

tag