జార్కండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా న్యాయమూర్తి ఉత్తం ఆనంద్ అనుమాన‌స్ప‌ద మృతిపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీనికోసం దేశంలోని అన్ని బార్ అసోసియేష‌న్లు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను కోరాయి. ఆనంద్ మృతి అనుమానాస్ప‌ద‌మంటూ ప్రాథ‌మిక నివేదిక తెలిపింది. జార్కండ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో తాను మాట్లాడాన‌ని, ర‌మ‌ణ ఢిల్లీ బార్ అసోసియేష‌న్‌కు తెలిపారు. ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తం ఆనంద్ బుధ‌వారం మార్నింగ్‌వాక్ చేస్తుండ‌గా అతివేగంగా వ‌చ్చిన టెంపో ఢీకొట్ట‌డంతో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అంద‌రూ సాధార‌ణ ప్ర‌మాదం అనుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన త‌ర్వాత ఈ సంఘ‌ట‌న ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిందేన‌ని, ప్ర‌మాదం కాద‌ని నిర్థారించారు. ఇదే విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా న్యాయ‌మూర్తి మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందే ఆ టెంపో అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఎస్సీ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాస్‌సింగ్ ఈ విష‌యంపై అత్య‌వ‌స‌ర విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag