తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గ్యాప్ లేకుండా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ మరియు తెలంగాణ లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. కాగా ఇప్పుడు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాగల 48 గంటలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ లో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ మరియు తెలంగాణ లో కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఇప్పుడే పరిస్థితులు మెరుగు పడుతుంటే మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: