జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్లో లేడీస్ బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్ కెమెరా పెట్టి రికార్డు చేసిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న హౌస్‌కీప‌ర్ బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్‌రూంలో వెళ్లిన యువ‌తి సెల్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉండ‌టం చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్‌రూంలో సెల్‌ఫోన్ ద్వారా బెనర్జీ ప‌లు వీడియోలను రికార్డు చేశాడు. రెండ్రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన బెనర్జీ  దాన్ని తీసుకెళ్లి లేడీస్ బాత్‌రూంలో పెట్టి ప‌లు వీడియోల‌ను రికార్డ్ చేశాడు. నాలుగున్నర గంటలపాటు బాత్‌రూం దృశ్యాలను బెనర్జీ చిత్రీకరించిన‌ట్లు తెలిసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీతో పాటు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. వన్ డ్రైవ్ వ్యవహారంపై  ప‌లువురు యువతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీడియోలు బయటకు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వన్‌ డ్రైవ్‌ యజమాని చైతన్యను అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: