మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన సినిమా ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. ప్ర‌కాష్‌రాజ్ ప్యానెల్ త‌రఫున గెలుపొందిన‌వారంతా రాజీనామాలు స‌మ‌ర్పించారు. అన‌సూయ లాంటివారు కోర్టుకు వెళ‌తాను అవ‌స‌ర‌మైతే అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు. బెన‌ర్జీలాంటివారు కంట‌త‌డి పెట్టారు. ఉత్తేజ్‌, త‌నీష్‌, స‌మీర్ కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. విచిత్రం ఏమిటంటే వీరంద‌రినీ తెర‌పై వివిధ ర‌కాల పాత్ర‌ల్లో చూసిన ప్ర‌జ‌లు ఇప్పుడు వీరంతా నిజంగా చెబుతున్నారా?  లేదంటే న‌టిస్తున్నారా?  జీవిస్తున్నారా? అనేది స్ప‌ష్టంగా తేల్చుకోలేక‌పోతున్నారు. తెర‌పై క‌న్నీరు రావాలంటే గ్లిజ‌రిన్ పెట్టుకోవాలి. కానీ నిజీవితంలో క‌న్నీరు రావాలంటే మ‌న‌సుకు బాధ క‌లిగితే చాలు. మోహ‌న్‌బాబు మాట‌ల‌కు, ప్ర‌వ‌ర్త‌న‌కు బెన‌ర్జీ, త‌నీష్ లాంటివారు బాధ‌ప‌డ్డారు. కానీ మోహ‌న్ బాబు, విష్ణు, న‌రేష్ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. వారి రాజకీయం ఏమిటో ఇంకా ఒక స్ప‌ష్ట‌త రాలేదు. ప్ర‌స్తుతానికి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ న‌డుపుతున్న రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉంది. త‌ర్వాత విష్ణు ప్యానెల్ రాజ‌కీయం ఎలా ఉంటుందో చూడాలి మ‌రి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa