మా స‌భ్య‌త్వానికి రాజీనా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నాగ‌బాబు బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. అన్న అన్న‌య్య‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌రికంగా వ్య‌వ‌హ‌రించాల‌నే ఆలోచ‌నే లేద‌ని, పెద‌రాయుడిలా సింహాస‌నంపై కూర్చోవాల‌న్న త‌ప‌న‌కానీ లేద‌న్నారు. చిరంజీవికి అంత అహంకారం కూడా లేద‌ని వ్యాఖ్యానించారు. ఒక‌ర‌కంగా నాగ‌బాబు ప‌రోక్షంగా మోహ‌న్‌బాబును ఉద్దేశించి మాట్లాడిన‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. పెద‌రాయుడు అనేప‌దం మోహ‌న్‌బాబు సినిమాకు సంబంధించిన‌ది. అలాగే త‌రుచుగా చాలామంది మోహ‌న్‌బాబును అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తుంటారు. ఆయ‌న శైలి కూడా అలాగే ఉంటుంది. ఇటీవ‌ల ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినీ పెద్ద‌లు మోహ‌న్‌బాబు, చిరంజీవిలాంటివారు వ‌స్తే క‌లిసి మాట్లాడుకుందామ‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మలో పెద్ద‌కోసం వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఏమైనా జ‌రుగుతుందా? అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే ప్ర‌శ్న మోహ‌న్‌బాబును అడిగితే ఆయ‌న పెద్ద అంటే గురువు దాసరి నారాయ‌ణ‌రావు అని, ఆయ‌న లేనిలోటును ఎవ‌రూ తీర్చ‌లేర‌ని, ఆ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీచేయ‌లేర‌ని, తెచ్చిపెట్టుకుంటే వ‌చ్చేవి కావ‌ని వ్యాఖ్య‌లు చేశారు. దానికి నాగ‌బాబు ఇప్పుడు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa