ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజూ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్‌తోపాటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా అలాగే కొనసాగుతుంది. ఈ రెండు వేరియంట్‌లతో దేశ ప్రజలు ఎంతగానో సతమతమవుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు బయట పడతాం.. స్వేచ్ఛగా ఎప్పుడు తిరుగుతామో తెలియని పరిస్థితి నెలకొంది. బయట, ఇంట్లో రక్షణ లేకుండా పోతుంది. వైరస్ ఒకరికి సోకినా.. ఇంటిల్లిపాది అంటుకుంటోంది. వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా ఒక శుభవార్తను అందించారు. కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందనే విషయాన్ని డాక్టర్ సమీరన్ స్పష్టతను ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 11 తేదీ నాటికి కరోనాకు శుభం కార్డు పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సమీరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశ ప్రజలంతా మాస్తులు ధరిస్తున్నారని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇదే తరహాలో ప్రజలు కొనసాగిస్తే.. కరోనాను త్వరలోనే ఖతం చేయొచ్చు. మళ్లీ కరోనా కొత్త వేరియంట్లు పుట్టకపోతే ఈ ఏడాది మార్చి 11వ తేదీ నాటికి కరోనాకు శుభంకార్డు పెట్టొచ్చు. ఆ తర్వాత అది కూడా సాధారణ జలుబుగా మారుతుంది.’’ అని డాక్టర్ సమీరన్ తెలిపారు.

అయితే వీరి ప్రకారం ఒమిక్రాన్ కేవలం 3 నెలల పాటే ప్రభావం చూపుతుందని అన్నారు. డిసెంబర్ 11వ తేదీన ఇండియాలో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని.. మార్చి 11వ తేదీ నాటికి ఒమిక్రాన్ కథ కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదని తెలిపారు. ప్రజలు మరిన్నీ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. అప్పుడే కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించగలమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: