ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుపాను మరోసారి వణికించబోతోంది. తుపాను ప్రభావం ఇప్పటికే ప్రారంభం కావడంతో అధికారులకు జిల్లా కలెక్టర్లు తగిన ఆదేశాలు ఇచ్చారు. మంగళ వారం సాయంత్రం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తగ్గేవరకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా యంత్రాంగాలను కలెక్టర్లు అప్రమత్తం చేశారు.


తీర ప్రాంతంలో ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు  తరలించామని అధికారులు చెబుతున్నారు. కచ్చా ఇళ్లు, గుడిసెల్లో వుండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కలెక్టర్లు  ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని 9 మండలాలో టీంలు అప్రమత్తంగా ఉండాలని ఆ కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. అందుకే తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.

మరింత సమాచారం తెలుసుకోండి: