పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది. ఈ పండుగ సీజన్ నేపథ్యంలో నెలకొనే డిమాండ్‌ కారణంగానే ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు ఊరట కలుగనుంది. స్పెషల్ ట్రైన్స్ మాత్రమే కాకుండా క్లోన్ ట్రైన్స్‌ను కూడా ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా నడుపుతుంది. ఇండియన్ రైల్వేస్ ఈ పండుగకు 395 స్పెషల్ ట్రైన్స్‌ పట్టాలెక్కిస్తోంది. వీటికి సంబంధించి పలు నివేదికలు వెలువడ్డాయి. ఇండియన్ రైల్వేస్ ఈ పండుగ స్పెషల్ ట్రైన్స్‌కు అధిక చార్జీలను వసూలు చేస్తుందని వీటి సారాంశం. ఇతర ట్రైన్లతో పోలిస్తే వీటి టికెట్ ధర దాదాపు 30 శాతం అధికంగా ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి.

అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్స్ టికెట్ ధరలపై స్పష్టత ఇచ్చింది. వెలువడుతున్న నివేదికలను కొట్టిపారేసింది. పండుగ స్పెషల్ ట్రైన్స్‌లో టికెట్ ధరల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. టికెట్ ధరల పెంపు భారం లేనందున ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వపు గత లాక్ డౌన్ల కారణంగా ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ట్రైన్ సర్వీసులు రద్దుచేసింది. అయితే గత కొన్ని రోజులుగా స్పెషల్ ట్రైన్స్ మాత్రం నడుపుతూ వస్తోంది. అది కూడా తక్కువగానే. క్రమక్రమంగా ఇండియన్ రైల్వేస్ ఈ ట్రైన్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇక అన్ని సర్వీసులను అతి త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రానున్నది ఇండియన్ రైల్వేస్.

మరింత సమాచారం తెలుసుకోండి: