ఇటీవలి కాలం లో దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను మనుషులు చేతులారా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా క్షణికావేశం లో నిర్ణయాలు  తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతు ఉండటం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. చిన్నచిన్న కారణాలకే అక్కడి తో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ చివరికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా అందరికీ ధైర్యం చెప్పి సమస్యలు పరిష్కరించాల్సిన పోలీస్ వృత్తిలో కొనసాగుతున్న ఎస్ఐ చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు.


 సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడూ ఎంతో ధైర్యం గా ఉండాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు రక్షణ కల్పించేందుకు ముందుండాలి. ధైర్య సాహసాలకు మారుపేరు గా ఉండాలి.  ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాదు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యం గా నిలబడి పరిష్కరించు కోవాలి. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి కి ఏం కష్టం వచ్చిందో ఏమో. చివరికి ఆయన మనసు గాయ పడింది.  దీంతో చివరికి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది.


 కాకినాడ జిల్లా సర్పవరం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అయితే పోలీస్ అధికారులు మాత్రం వేరేలా చెబుతున్నారు. మిస్ ఫైర్  జరిగిన కారణంగానే ఎస్ఐ మృతి చెందాడని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించినట్లు చెప్పుకొచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఎస్సై మృతి పట్ల విచారణ కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ విచారణలో ఎస్ ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా మిస్ ఫైర్ అయ్యిందా అన్న విషయాన్ని తేల్చి చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Si