నేటి సమాజంలో సాంకేతికత పెరిగే కొద్దీ వాటి వళ్ళ వచ్చే లాభాలతో పాటు ముప్పు కూడా అంతే స్థాయిలో వాటిల్లుతుంది. ఇక కొత్త టెక్నాలజీని మంచిపనుల కోసం వినియోగిస్తే సమాజానికి ఎలాంటి చెడు జరగదు. కానీ కొంతమంది డబ్బులకు కక్కుర్తి పడి సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ ఉన్నన్నాళ్లు హ్యాకర్స్ వారి పని వారు చేసుకుంటున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ నేషనల్ కాల్స్ పై ప్రజల్లో అవగాహన కలిపిస్తున్నారు. కొంతమంది కాల్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజగా ఇలాంటి కోణంలో ఓ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి దుర్వినియోగం చేస్తున్న అక్రమ టెలికామ్ సెటాప్స్ పై అలిపిరి పోలీసులకు భారత కమ్యూనికేషన్ డైరెక్టర్ (సెక్యూరిటీ) బివి మనోజ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఇక అనుమానాస్పద మొబైల్ నెంబర్ ను పూర్తించాలని అలిపిరి పోలీసులు భారత కమ్యూనికేషన్ అధికారులను కోరాడు.

అయితే కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇక దర్యాప్తులో భాగంగా తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద ఉన్న మొబైల్ టవర్ల నుంచి అనుమానాస్పద మొబైల్ ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాగా.. ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి సొమ్ముచేసుకోవడం వల్ల టెలికం సంస్థల ఆదాయానికి గండిపడటమే కాకుండా.. దేశభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. .

కాగా.. తిరుపతి పరిధిలో గత ఏడాది కాలంగా ఇలాంటి చర్యలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఇక నిందితులు 90597 34645, 7995672806, 7207440569, 9121929184, 91219 25958 ఫోన్ నెంబర్లను ఉపయోగిస్తున్నట్లు సిఐ దేవేంద్ర వెల్లడించారు. అయితే ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: