సాధారణంగా కొంతమంది దాహం వేసింది అంటే అస్సలు తట్టుకోలేరు. ఈక్రమంలోనే దాహం వేయగానే తమతో పాటు తెచ్చుకున్న నీళ్లను తాగడం చేస్తూ ఉంటారు. ఒకవేళ తమతోపాటు నీళ్లు తెచ్చుకోకపోతే ఇక పక్కనే ఉన్న షాప్ లో నీళ్లు కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఎక్కడైనా తాగే నీరు కనిపించిందంటే హడావిడిగా వెళ్లి తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా హడావిడిగా వెళ్లి నీళ్లు తాగడమే ఇక్కడ ఒక వ్యక్తి పాలిట శాపంగా మారి పోయింది. దాహం వేస్తోంది అని వెనకా ముందు ఆలోచించకుండా తొందరపడి అతను ఒక బాటిల్ లో ఉన్న నీళ్లు తాగాడు.


 అయితే ఇలా తాగిన తర్వాత తెలిసింది ఆ బాటిల్ లో ఉన్నది మంచినీరు కాదు ఏకంగా యాసిడ్ అని. దీంతో ఒక్కసారిగా అతను షాక్ లో మునిగిపోయాడు. ఇక నిమిషాల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నిజాంబాద్ లో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహబూబ్ నగర్కు చెందిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి నిజాంబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వస్త్ర దుకాణానికి వచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ కు దాహం వేయడంతో నీళ్లు కావాలని ఇక అక్కడ వస్త్ర దుకాణాల సిబ్బందిని  అడిగాడు.


 ఈ క్రమంలోనే వస్త్ర దుకాణం సిబ్బంది ఒక నీళ్ల బాటిల్ ని తీసుకువచ్చి అతనికి ఇచ్చారు.. దీంతో దాహం వేయడంతో గుటగుట తాగేశాడు విజయ్ కుమార్. ఇక అతనితో పాటు అదే వస్త్ర దుకాణ సిబ్బందిలో ఒకరు కూడా బాటిల్లో నీళ్లు తాగారు. కానీ ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాటిల్ లో ఉంది నీరు కాదు యాసిడ్ అనే విషయాన్ని సిబ్బంది గ్రహించి వెంటనే అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తమకు సమాచారం అందలేదని బాధితుల ఫిర్యాదు తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: