క‌రోనా వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మైంద‌ని ప్ర‌పంచ దేశాల నుంచి చైనాపై విసుర్లు మొద‌లైన నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ యేటా అందించే ఆర్థిక సాయంతో పాటు అద‌నంగా 30మిలియ‌న్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. డ‌బ్ల్యూహెచ్‌వోకు అంద‌జేస్తున్న నిధుల్లో కోత విధిస్తున్న‌ట్లుగా కొద్దిరోజుల క్రితం  అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్  ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  ఈప‌రిణామం త‌ర్వాత చైనా కాలంగా స్తంబ్దుగా ఉంటూ వ‌స్తోంది. ఇక ట్రంప్ అయితే నేరుగా చైనాపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. చైనా నుంచి మాత్రం పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. చైనా ల్యాబుల్లోనే క‌రోనా వైర‌స్ త‌యారు చేయ‌బ‌డిద‌న్న‌ది ట్రంప్ చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

 

ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌పంచంలోని చాలా దేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మూడు రోజుల క్రితం ట్రంప్ ఏకంగా చైనాకు అమెరికా నుంచి కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని పంప‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అయితే చైనా నుంచి మాత్రం మౌన‌మే స‌మాధానమైంది.  డ‌బ్ల్యూహెచ్‌వో మాత్రం చైనా ల్యాబుల్లో వైర‌స్ త‌యారైన‌ట్లుగా ఎలాంటి ప్రాథ‌మిక ఆధారాలు ల‌భ్యం కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే అమెరికా అధ్య‌క్షుడికి మాత్రం చైనాపై అనుమానాలు తొల‌గ‌డం లేదు. అంత‌ర్జాతీయంగా చైనాకు చాలా దేశాలు దూరంగా ఉండాల‌ని మాన‌సిక సంసిద్ధ‌త‌కు వ‌చ్చేయ‌డం గ‌మ‌నార్హం. స‌మీప భ‌విష్య‌త్‌లో చైనాపై న‌మ్మ‌కం క‌లిగే ఉండే దేశాలు చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

 


ఏవో కొన్ని క‌మ్యూనిస్టు దేశాలు.. చైనా విదిల్చే రుణాల కోసం ఎదురుచూసే పాకిస్థాన్ లాంటివి మిన‌హా ప్ర‌పంచం మొత్తం డ్రాగ‌న్ దూరం కావ‌డం ప‌క్కా. అదే జ‌రిగితే ప్ర‌పంచ వ్యాపారంపై కోటాను కోట్లు పెట్టుబ‌డి గుమ్మ‌రించిన చైనీ పెట్టుబ‌డుదారుల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న‌ది ఆర్థిక విశ్లేష‌కుల అంచ‌నా. అయితే ఈ ప‌రిణామాల‌కు ఆదిలోనే అరిక‌ట్టేందుకు డ్రాగ‌న్ దాతృత్వాల‌తో ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు ఆరంభించిన‌ట్లు తెలుస్తోంది. కరోనాపై పోరాడే నిమిత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చైనా 30 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.228 కోట్ల) అదనపు సాయం ప్రకటించ‌డం వెనుక అస‌లు ఉద్దేశం అదేన‌ని విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: