బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భయంకరమైన, ఉత్కంఠ భరితమైన సమాచారం తనవద్ద ఉందని - అది బయట పెడితే ఆ విషయం భారత పార్లమెంట్ నే కుదిపేస్తుందని తెలిపారు. అయితే దీంతో సీఎం కేసీఆర్ కు దాదాపు నిద్రలేకుండా పోయిందట. ఆయనకు దొరికిన ఆధారం ఎలాంటిదో? అందులో ఉన్న గుట్టేమిటో? గాని ఆ వార్త సమాచారం కోసం తెలంగాణ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బండి సంజయ్ మాత్రం కేసీఆర్ ను కబడ్డీ ఆడిస్తున్నాడు.


జిహెచ్ఎంసి ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని నమ్మకంగా చెప్పిన బండి సంజయ్ - కేసీఆర్ దేశ రాజధాని వెళ్లొచ్చాక సంజయ్ మౌనం ఆశ్రయించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చాక కూడా, కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కేంద్రం దగ్గర  పొర్లు దండాలు పెట్టి వచ్చారని ఆయినా ఆయన జైలుకు వెళ్ళటం తప్పదని అన్నారు.


కేసీఆర్ అవినీతికి సరైన ఆధారాలు ఉన్నాయని చెప్పినా, ఆ తర్వాత కేసీఆర్ జైలు కెళ్ళటం గురించి పెద్దగా మాట్లాడటం లేదు. అందుకే సంజయ్ వద్దనున్న  సమాచారంపై జనాలకు అనుమానం లేకపోయినా, కేంద్ర నాయకత్వం అదుపు చేస్తుందని జనం భావిస్తున్నారు. గతంలో ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారని, తన దగ్గర ఆధారాలున్నాయని బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు. ఆ విషయాన్ని తాను కనిపెట్టానని అంటున్నారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్‌ను కుదిపేసే అంశం అవుతుందని, అందుకే స్పీకర్ అనుమతి కోసం చూస్తున్నానని   బీజేపీ అధిష్టానం అనుమతితో కేసీఆర్ బండారం తాను బయట పెడతానని సంజయ్ బల్లగుద్ది చెపుతున్నారు.


బీజేపీలో కొన్ని చేరికల సందర్భంగా ప్రెస్-మీట్లో ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో ఇష్ఠాగోష్టి సందర్భంగా మాట్లాడిన ఆయన సూచన మాత్రం గా ఈ విషయం వెలిబుచ్చారు. ఇది కనుక బయట పడితే ముమ్మాటికీ పార్లమెంట్ ను కుదిపేసే అంశం అవుతుందని బండి సంజయ్ ఒక్కసారి గా బాంబు పేల్చారు.కానీ ఆ విషయం ఏమిటనేది లేశ మాత్రం కూడా బయట పెట్టలేదు.తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ సభ్యుడు
గా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు.



బండి సంజయ్ ఏ అంశంపై మాట్లాడతారో చెప్పలేదు కానీ, పార్లమెంట్‌ ను కుదిపేస్తుందని చెబుతున్నారు. ఆయనకు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి సమాచారం వచ్చి ఉంటుందని దాని ఆధారంగానే అయన ఇలా మాట్లాడు తున్నారని బీజేపీలోని ఒక వర్గం భావన.

కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న ప్రకటన లాగే దీనిపై కూడా “సైలెంట్” అయితే మాత్రం, ఈ సారి బండి సంజయ్ కుమార్ మాటలకు ప్రాధాన్యత దక్కదు.

కపిలవాయి దిలీప్ కుమార్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కేసీఆర్ కుటుంబ వ్యతిరేఖ శక్తులు, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని, కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం పీవీని వాడుకుంటున్నారని, మోసం చేయడంలో కేసీఆర్ ఏక్ నంబర్, కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు.

దానితో పాటు చివరకు అపర చాణక్యుడు దివంగత పీఎం పివి నరసింహరావు - కుటుంబాన్ని కుడా ఇప్పుడు రాజకీయాల్లోకి లాగి, వారిని అవమానించ బోతున్నారని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అపర చాణక్యుని కుటుంబంపై కుచ్చిత కుతంత్రాన్ని ప్రయోగించటం ఆయనకే చెల్లింది. పీవీని ఒక ప్రక్క స్వంతం చేసు కుంటున్నట్లు కనిపిస్తూనే - వారికీ అవమానం కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

ఇది చూసి జనం విస్తుపోతున్నారని సంజయ్ అంటున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆరెస్ అభ్యర్థిగా ఎవరికీ అచ్చిరాలేదు. అలాంటి చోట పివి కుమార్తె వాణికుమారి గారిని అభ్యర్థిగా పోటీకి పెట్టి - వస్తే కొండ వస్తుంది పొతే వెంట్రుక పోతుంది - అని చోద్యం చూస్తున్నారు కేసీఆర్.


 

మరింత సమాచారం తెలుసుకోండి: