రాజకీయాల్లో అనుభవం ఉండటం వేరు ఆ అనుభవాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం వేరు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఎంత వరకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉన్నా... రాజకీయంగా ఆయన ముందుకు వెళ్తున్న విధానం మాత్రం కొంత మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇక దాదాపుగా లేనట్టే అనే వ్యాఖ్యలు నుంచి అధికార పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఇబ్బంది పెడుతున్నారు అనే వరకు కూడా తెలుగుదేశం పార్టీ 2019 తర్వాత ముందుకు వెళ్ళింది అనే మాట వాస్తవం.

 రాజకీయంగా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇస్తున్న ధైర్యం...  ముఖ్యమంత్రి నుంచి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నా పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతమాత్రం కూడా పెట్టకుండా కంగారు పడకుండా పార్టీ భవిష్యత్తు పై నమ్మకం కలిగిస్తూ పార్టీ నాయకులను కాపాడుకుంటూ చంద్రబాబు ముందుకు వెళ్తున్న తీరు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది నాయకులు ప్రమాదాల్లో... హత్యల కారణంగా మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబునాయుడు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాజకీయం చేశారు. 2009లో చంద్రబాబు నాయుడు ను ఓడించడానికి రాజశేఖర్రెడ్డి కొన్ని రాజకీయ పార్టీలను సృష్టించారు అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

 47 సీట్లతో 2004లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు... దాదాపు 95 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం లోకి రాగలిగారు అప్పుడు రాజశేఖరరెడ్డిని 147 సీట్లు మాత్రమే చంద్రబాబు పరిమితం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా రాజకీయం చేసిన 2019లో కొన్నికొన్ని స్వయంకృతాపరాధాలు వల్ల పార్టీ ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్నారా...?  అంటే అవుననే సమాధానం వినబడుతోంది. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే చంద్రబాబునాయుడు పట్టుదల మాత్రం అధికార పార్టీని ఇబ్బంది పెడుతుంది అనే మాట వాస్తవం.

 మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వగలిగింది. తెలుగుదేశం పార్టీ దెబ్బకు అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు కూడా వేయించారు అనే వ్యాఖ్యలు వినిపించాయి. 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షానికి కూడా దాదాపుగా అర్హత కోల్పోయి ఇబ్బంది పడే స్థాయికి వచ్చినా చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా బెదరకలేదు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ నాయకులపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు పై అవినీతి ఆరోపణలు వినిపించిన చంద్రబాబు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇదే విధంగా చంద్రబాబు రాజకీయం చేసి భవిష్యత్తులో గనక ముందుకు వెళ్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: