
ముఖ్యంగా భారత్ లో రష్యా పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. తద్వారా భారత్, రష్యాల బంధం మరింత మెరుగుపడనుంది. పెట్రోల్, డిజీల్ తవ్వకాల అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోంది. మన దేశంలో మైనింగ్ కు సంబంధించిన విషయంలో కూడా రష్యా నిధులు అందజేసింది. లిథియం, యూరేనియం, ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో ఆయిల్ నిక్షేపాల వెలికితీతలో అనుభవం ఉన్న రష్యా రోస్ నెప్ట్ సంస్థ అతిపెద్ద ఆయిల్ రిపైనరీ కంపెనీని పెట్టడానికి సిద్ధమైంది. ఇండియన్ ఆయిల్ తో పాటు గా బీపీసీఎల్ తో కలిపి 44 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.
అంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్, ఇండియా నుంచి వచ్చే ఆయిల్ అన్నింటిని శుద్ధి చేసి ఇండియా నుంచే అమెరికా, నాటో దేశాలకు సరఫరా చేసేందుకు సిద్దమైంది. అంటే ఏ దేశాలైతే తమపై ఆధిపత్యం వహించి ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయో వాటికే ఆయిల్ సరఫరా చేసి తమ సత్తాను చాటాలని రష్యా కోరుకుంటోంది. దీనికి ఇండియా, రష్యా లాంటి దేశాలను అనుకూలంగా మలుచుకుంటోంది.
కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. ఉక్రెయిన్ కు అమెరికా సపోర్టు, రష్యాకు చైనా సపోర్టుతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధం ముగిసి శాంతి చేకూరాలని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి.