ప్రస్తుతం యువత టెక్నాలజీని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నారు.. సైన్స్ ను డెవలప్ చేయడంలో యువత పోటీ పడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.అందుకే అంటారు చిన్న వయసులోనే అన్నీ అలవాటు చేస్తే పెద్దయ్యాక ప్రపంచాన్ని కూడా చిన్నగా చూపిస్తారు.. భారత దేశం మొత్తం గర్వంతో పొంగిపోతుంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. టైమ్స్ ఈ ఏటి మేటి 100 ఆవిష్కరణలలో భారతీయ యువకుడు అర్నవ్ కపూర్ రూపొందించిన ‘మైండ్- రీడింగ్’ హెడ్‌సెట్ ఒకటిగా నిలిచింది.



ప్రస్తుతం అమెరికా లోని ఎంఐటీలో పోస్ట్‌ డాక్టోరల్ స్టూడెంట్ అయిన అర్నవ్.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే మైండ్ రీడింగ్ హెడ్‌సెట్‌ను రూపొందించాడు. తన సోదరుడు శ్రేయాస్‌ సహా ఎంఐటీ మీడియా ల్యాబ్‌లోని ఇతర పరిశోధకుల తో కలిసి దీనిని తయారు చేశారు. ఈ పరికరం ముఖ్య ఉద్దేశ్యం మనం పెద్దగా మాట్లాడకపోయినా, బయటకు చెప్పలేని ఆలోచనలు ఇప్పటికీ మన అంతర్గత వ్యవస్థ ద్వారా కొనసాగుతున్నాయి. అంటే పదాలను ఉచ్ఛరించకపోయినా నాలుక కొద్దిగా కదులుతుందని దీని అర్థం. మనసులోని భావాలకు బయటపెట్టడం ఈ హెడ్ సెట్ విజయవంతంగా పనిచేస్తుంది.



ఏఎల్ఎస్, ఎంఎస్ సహా భావాలను వ్యక్తం చేయలేని వారికి సహాయపడటం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక ఉద్దేశం’ అని ఎంఐటీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతకు మించి ఈ వ్యవస్థ మానవులు, కంప్యూటర్లను సజావుగా ఏకీకృతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంప్యూటర్, ఇంటర్ నెట్ కృత్రిమ మేధస్సు మన జీవితంలో సర్వ సాధారణం అయిపోయాయి. ఇవి జ్ఞానం తో మనిషి సామర్థ్యాలను మరింతగా పెంచుతాయి అంటున్నారు. హెడ్‌సెట్ సెన్సార్లు ముఖం, స్వరపేటిక కండరాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సంకేతాలను ప్రేరేపిస్తుంది. అప్పుడు ఈ పరికరం కంప్యూటర్‌కు చర్యలను పంపుతుంది.. ఎదుటి వ్యక్తుల మనోభావాలను తెలుసుకునేలా ఈ పరికరం ఉపయోగ పడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: