పూర్వం వయసు పెరిగేకొద్దీ మెదడు పనితీరు తగ్గి, జ్ఞాపక శక్తి తగ్గేది.కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలో కూడా మెదడు పనితీరు దెబ్బతింటూ ఉంది.అలాంటి పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గి,చురుగ్గా ఉండకపోవడం,చదువుల్లో వెనకబడి ఉండటం వంటివి జరుగుతుంటాయి.వీటికి కారణం అతిగా జంక్ ఫుడ్ తినడం,టీవీ,మొబైల్ వంటి బ్లూ స్క్రీన్ లు ఎక్కువగా చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అలాంటి పిల్లలకు టీవీ,మొబైల్ చూడటం క్రమంగా మాన్పించాలి.మరియు మెదడు పెరుగుదలకు తోడ్పడె జింక్ వంటి మినరల్స్ కలిగిన జ్యూస్ లు,స్మూతిలను తరుచూ ఇవ్వడం వల్ల క్రమంగా వారి మెదడు పనితీరు మెరుగుపడి,జ్ఞాపక శక్తి పెరుగుతుంది.అంతటి ఉపయోగం కలిగిన స్మూతి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

స్మూతికి కావాల్సిన పదార్థాలు..
దీనికోసం ఐదారు బాదంలు,ఒక అరటిపండు, నాలుగైదు జీడిపప్పు, రెండు లేదా మూడు ఖర్జూరాలు, ఐదారు ఎండు ద్రాక్ష తీసుకోవాలి.

స్మూతీ తయారు చేసే విధానం..
స్మూతి తయారు చేసుకోవడానికి ముందు బాదాములు, జీడిపప్పు,ఖర్జూరాలు,ఎండు ద్రాక్షలు బాగా కడిగి,ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే, బాదం పొట్టు తీసి,మిగతావన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి.మరియు అరటి పండును ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి,అందులో సపరేట్ ప్లేట్లో పెట్టి ఉడికించుకోవాలి.బాగా మెత్తగా ఉడికిన తర్వాత తీసి గ్రైండ్ చేసుకోవాలి.బాదం మిక్స్ లో ఈ మిశ్రమాన్ని కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వాలి.ఇలా తరచూ ఇవ్వడం వల్ల,వారికి మెదడు పెరుగుదలకు కావాల్సిన జింక్ బాగా అంది,జ్ఞాపక శక్తి పెరగుతుంది.


ఇందులో వున్న ఐరన్ రక్తం పెరుగుదలకు ఉపయోగపడి, మెదడుకు సరైన రక్త సరఫరా జరిగి మెదడు పనితీరు మెరుగు పడుతుంది.అంతేకాక అరటిపండులో ఉన్న మెగ్నీషియం మెదడు కండరాలు బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది.జీడిపప్పు, ఎండు ద్రాక్షలు,శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడానికి దోహదపడతాయి.పిల్లలో జ్ఞాపకశక్తి పెంచడానికి, ఆహారమే కాక,మెదడు పెరుగుదలకు ఉపయోగపడే పజిల్స్ చేయడం,అవుట్ డోర్ గేమ్స్ ఆడటం,వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: