
నుదిటి మీద చంద్రవంక తిలకాన్ని దిద్దుకుని, అందమైన రాజకుమారుని వేషంలో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఈ స్టిల్ 1962లో విడుదలైన 'గులేబకావళి కథ' అనే జానపద సినిమా లోనిది. ఈ సినిమా ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థ ఎన్ఎటి నిర్మించిన ఐదో సినిమా కావడం విశేషం. అంతకుముందు నిర్మించిన 'సీతారామ కళ్యాణం'కు ఎన్టీఆర్ దర్శకత్వం వహించినా ఆ సినిమాకు తన పేరును వేసుకోలేదాయన. అలాగే తాను దర్శకత్వం వహించినప్పటికీ 'గులేబకావళి కథ' సినిమాకు కూడా దర్శకునిగా కమలాకర కామేశ్వరరావు పేరును వేశారు. దర్శకులంటే ఎన్టీఆర్ కు అంత గౌరవం ఉండేది.
సినిమా పేరులో గులేబకావళి అంటే 'గుల్ -ఎ - బకావళి' - 'బకావళి అనే పువ్వు' అని అర్థం. పర్షియన్ జానపద సాహిత్యం 'అల్ఫ్ లైలా వహ్ లైలా'లో గుల్ -ఎ - బకావళి కథ ఉంది. అలాగే తెలుగులో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన 'కాశీ మజిలీ కథలు'లో కూడా ఈ కథ ఉంది అంటారు. గులేబాకావళి కథ ప్రసక్తి రాగానే ' నన్ను దోచుకొందువటే ... ' అన్న పాట నోటివెంట పలకాల్సిందే. ఇది డాక్టర్ సి. నారాయణ రెడ్డి రాసిన మొదటి సినీ గీతం. అద్భుత యుగళగీతం. అంతకుముందు హైదరాబాదులో ఒక కార్యక్రమంలో సినారెను కలుసుకున్న ఎన్టీఆర్, సినిమా పాటలు రాసేందుకు సినారెను ఒప్పించడము, ఆ వెంటనే పిలిచి తన స్వంత సినిమాలో అవకాశం ఇవ్వడమూ వెంటవెంటనే జరిగాయి. ఆ తర్వాత వారిద్దరికీ మధ్య విడదీయరాని మైత్రీ బంధం ఏర్పడింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు