
అనీష్ కురువిల్లాను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. హైదరాబాదులోని ఒక మలయాళ కుటుంబంలో జన్మించిన అనీష్ కురువిల్లా.. ` డాలర్ డ్రీమ్స్ ` తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలో అనీష్ ఓ ముఖ్య పాత్రను పోషించడంతో పాటుగా అసిస్టెంట్ డైరెక్టర్ గానూ వర్క్ చేశారు. ఆ తర్వాత ` ఆనంద్ ` మూవీలో హీరో కజిన్ గా అనీష్ అలరించారు.
శేఖర్ కమ్ముల యొక్క చాలా చిత్రాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన అనీష్.. ` ఆవకాయ్ బిర్యానీ ` తో మెగా ఫోన్ పట్టారు. 2008లో విడుదలైన ఈ క్రేజీ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ` కో అంటే కోటి ` సినిమాను తీశారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా పరిచయం పాలైంది. దాంతో యాక్టింగ్ పై దృష్టి సారించిన అనీష్ 2016లో ` పెళ్లి చూపులు ` మూవీతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు అనీష్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ, అదిరిపోయే పర్సనాలిటీతో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే అనీష్ కురువిల్లా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. జుట్టు, గడ్డం పూర్తిగా నెరిసినా.. ఈ పెద్దాయన మాత్రం స్టిల్ సింగిల్.
ఏజ్ బార్ అయిన కూడా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నిస్తే.. మ్యారీడ్ లైఫ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడమే అని అనీష్ చెబుతున్నారు. సోలో లైఫ్ సో బెటర్ అని ఆయన తేల్చేస్తున్నారు. పెళ్లి అనేది తనకు సెట్ కాదని.. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసినప్పటికీ మ్యారేజ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అనీష్ పేర్కొన్నారు. కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ దొరుకతున్నప్పుడు పెళ్లి అవసరం లేదనిపించింది.. నా లైఫ్ లో నేను మాత్రమే ఉన్నాను.. ఉన్నంత కాలం హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక అంటూ అనీష్ కురువిల్లా చెప్పుకొచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు