ఫ్రక్టోజ్ చక్కెరలు మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మనలోనే నిరోధక కణాల్లోని శక్తి నశింపజేస్తాయి. దీనితో మనము స్లోగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇది ఆహారాలలో తక్కువ కేలరీలు కార్బోహైడ్రేట్ గా పరిగణించబడుతుంది. చాలామంది ప్రతిరోజూ ఫ్రక్టోజ్ చక్కెర  యొక్క సహజ అలాగే అని పిలుస్తారు. చాలా తరచుగా ఈ పదార్థం వివిధ పండ్లు కూరగాయలు మరియు తేనెలలో వాడవచ్చు. కానీ రోగాలకు పెట్టు చక్కెర ద్వారాలు తెరుస్తున్నాయి అంటున్నారు. దీని గురించి తెలుసుకుందాం.


 ఫ్రక్టోజ్ చక్కెరలు మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.  ఫ్రక్టోజ్ చక్కెరలు అతిగా  తీసుకోవడం వల్ల అవి మనలోని వ్యాధి నిరోధక కణాలలోని శక్తి ని నశింపజేస్తాయట. దీంతో  దీర్ఘకాలం లో మనం సులువుగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందట. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు, లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో కలిసి స్వాన్షియా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తాజాగా నేచర్ కమ్యూనికేషన్ జర్నల్ లో వారి అధ్యయనం ప్రచురితమైంది.


 ఫ్రక్టోజ్ చక్కెరలు చక్కెరలన్నిటీలో కంటే అత్యంత తీయని చక్కెరలు. ఇవి సాధారణంగా తీయని పానీయాలు స్వీట్లు ఇతర చక్కెరల తో తయారు చేసిన వివిధ తీపి పదార్థాల్లో ఉంటాయి. తీపి గా ఉండే ఆహార పదార్థాల ఉత్పత్తి కోసం ఫ్రక్టోజ్ చక్కెరలు  విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈఫ్రక్టోజ్ చక్కెరల వల్ల ఒబిసిటీ, టైప్ 2 డయాబెటిస్, నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీలివర్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోఫ్రక్టోజ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.


 అయితే  ఫ్రక్టోజ్ చక్కెరలు ఎక్కువగా తీసుకుంటే మన వ్యాధినిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సరైన అవగాహన ఉండటం లేదు. తాజా అధ్యయనం ప్రకారం ఫ్రక్టోజ్ చక్కెరలు అతిగా తీసుకుంటే అవి మనం రోగనిరోధక వ్యవస్థ క్రమంగా నశింపజేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతున్న కొద్ది దాన్ని దెబ్బతీసే కారకాలు మరింత బలపడతాయి. దీంతో మన శరీరంలోని కణాలను కణజాలాలను దెబ్బతీస్తాయి. దానివల్ల మన ఉంటూనే వివిధ అవయవాలు, అవయవ వ్యవస్థలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి. దీనితో మనం రోగాల బారిన పడతాం. అందువల్ల ఫ్రక్టోజ్ తో కూడిన అతి తీయని పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: