జుట్టు  అందంగా కనపడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు  జుట్టు  అందంగా ఉండడమే  కాకుండా, ఒత్తుగా పెరగాలని  అనుకుంటారు. అలాంటివాళ్లు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు ఏపుగా  పెరుగుతుంది. ఆ చిట్కాలు ఉపయోగించడం వల్ల జుట్టు ఎలా పెరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం...
 చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అలాంటి వారు దువ్వెనతో స్పీడుగా దువ్వ కుండా, నిదానముగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దువ్వెన లో  చిక్కి తెగిపోకుండా  వుంటుంది.
 తలకు నూనె పట్టించే టప్పుడు పైన పైన పట్టకుండా,  కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా మర్దన చేస్తూ పట్టించుకోవాలి.  ఇలా పట్టించు కోవడం వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు  ఏపుగా పెరుగుతాయి.
 స్నానం చేసేటప్పుడు షాంపు వాడుకోకుండా కుంకుడు కాయ రసం తో వారానికి రెండుసార్లు తలంటు పోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలిపోకుండా ఉండడమే కాకుండా బాగా పెరుగుతాయి.
 బయట తిరిగేటప్పుడు తల మీద ఎండా, దుమ్ము ధూళి పడకుండా ఉండడానికి తలపైన తోపు పెట్టుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు చిట్లిపోకుండా ఉంటాయి.
 తల స్నానం చేసిన వెంటనే దువ్వు కోకూడదు చుట్టూ ఆరిన తర్వాత దువ్వుకోవడం  చాలా మంచిది. తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుంది.
 మందారం పూలు తీసుకొని నూనెలో బాగా మరగనిచ్చి. చల్లారిన తర్వాత తలకు బాగా మర్ధన చేయాలి.  ఇలా చేయడం వల్ల జుట్టు పెరగటమే కాకుండా, మృదువుగా ఉంటుంది.
 తలస్నానం చేసే ముందు తల అంతా కలబంద రసం తో బాగా మర్దన చేయాలి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
 ఎక్కువగా ఆందోళనగా ఉండకూడదు. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. జుట్టు ఏపుగా పెరగాలంటే జుట్టుకు అవసరమైన పోషకాలు ఉన్నా ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ప్రోటీన్లు కూడా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలు, పండ్ల రసాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: