కరోనా మహమ్మారి ఇప్పుడు దారుణంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ టైం లో వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృద్ధులకి కరోనా సోకితే చాలా ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్దులు ఈ టైంలో మీడియాకి ఎక్స్పోజర్ తగ్గించడం చాలా మంచిది. రాత్రి నిద్రకి ముందు కరోనా సంబంధిత వార్తలు చూడడం అలాగే సోషల్ మీడియా చెక్ చేయడం ఆపివేయాలి.ఇక అసలు వార్తలు చూడకుండా ఉండడం చాలా మంచిది.


ఆసుపత్రిలో బాధపడుతున్న వ్యక్తుల సంబంధించిన వీడియో క్లిప్స్ చూడడం ఎవాయిడ్ చేయడం మంచిది.అలాగే అపనమ్మకం, అవిశ్వాసం వల్ల లక్షణాలు ఇంకా ఎక్కువవుతాయి.అలాగే చుట్టూ ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకొని దానికి తగినట్లుగా ఉండడం వల్ల ఈ సిచ్యుయేషన్‌తో డీల్ చేయడం చాలా తేలిక అవుతుంది.అలాగే మీరు కోలుకునేందుకు ఎక్కువగా సమయం పడుతుంది,తొందరగా గా కోలుకోవాలని ఆశించకండి, అలాగే అస్సలు ఆ దిశగా ఆలోచించకండి.


మీరు చేయగలిగిన వ్యాయామాలు రోజు చేయండి.వ్యాయామం చెయ్యడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి, ఈ హార్మోన్లు శాంతినిస్తాయి.ఇక అలాగే యోగా, మెడిటేషన్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ ని మీ రొటీన్ లైఫ్ లో చేసుకోవడం చాలా మంచిది.ఇక అలాగే మీకు నచ్చిన సంగీతం వినడం ఇంకా మీకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడం కసేపు అటూ ఇటూ తిరగడం లేదా వంట చేయడం వంటి పనుల ద్వారా ఉత్సాహాన్ని పొందండి.అలాగే కొవిడ్ 19  గైడ్‌లైన్స్‌లో భాగంగా పాటించే సోషల్ ఐసొలేషన్ వల్ల ఒంటరిగా అనిపిస్తుంది.


అందుకే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండటం చాలా మంచిది.ఇక కరోనా గురించి కాకుండా ఇతర విషయాల గురించి మాట్లాడుకోవడం చాలా మంచిది.ఇక నీటిలో చేతులు పెట్టడం అలాగే మీకు దగ్గరగా ఉన్న వస్తువులని పట్టుకోవడం వంటి గ్రౌండింగ్ వ్యాయామాలు చేయండి.అలాగే రోజు కూడా గాఢంగా ఊపిరి పీల్చి వదలండి.ఇంకా అలాగే మీకు నచ్చిన ఆహార పదార్ధాన్నో, పానీయాన్నో ఇష్టంగా ప్రతి రుచినీ ఆస్వాదిస్తూ తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: