అందరికి ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో ఆహార విప్లవాల నేపథ్యంలో హరిత విప్లవం తెచ్చారు. అందులో ఆహార నాణ్యత కంటే ఎక్కువ దిగుబడి గురించే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దానితో వచ్చేకొద్దీ తరాలలో శారీరక దృఢత్వం తగ్గిపోతుంది. తినే ఆహారంలో సరైన పోషకవిలువలు అందక, ప్రత్యేకంగా వాటిని మళ్ళీ కొని తీసుకునే పరిస్థితి లేక భారత్ లో ప్రస్తుతం చాలా ఎక్కువ మంది పౌష్టికాహార లోపితంతోనే ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపాలు భవిష్య తరాలపై తీవ్రమైన ప్రాభవం చూపుతుంది. ఈ స్థితి బాగా మహిళల్లో మరియు పిలల్లలో కనిపిస్తుందని అంతర్జాతీయ నివేదికలు కూడా వెల్లడిస్తునే ఉన్నాయి. మరో పక్క కరోనా లాంటి కొత్త కొత్త వైరస్ లు ప్రపంచాన్ని ఆవహిస్తున్నాయి. ఇలాంటి వైరస్ లను తట్టుకునే శక్తీ రానురాను తగ్గిపోతుందని, అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు నిపుణులు.

తిండి కోసం ఖర్చు చేయడానికి ఆలోచిస్తే, వైద్యం ఖర్చు పెరిగిపోతుంది అని నిపుణులు అంటున్నారు. అయితే కనీస సౌకర్యాలు కూడా ఇంకాఅందని వారు దేశంలో చాలా మంది ఉన్నారు. వారందరికి ప్రభుత్వం అనేక పధకాల ద్వారా ఆయా ఫలాలను ఇస్తున్నప్పటికీ, అవి పండించేది కూడా పస లేని విధానంలోనే కావడంతో ఏదో ఆకలికి ఇంత తినాలి అనేదే తృప్తి చెందుతుంది తప్ప పౌష్టికాహారం మాత్రం అందటం లేదు. అందుకే ఇటీవల కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హరిత విప్లవం ద్వారా వచ్చిన వంగడాలు కాకుండా, గతంలో పెద్దలు చూపిన దారిలో ఈ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దానితో మంచి వంగడాలను రూపొందిస్తు, అవి ఇతర రైతులకు కూడా అందిస్తున్నారు. ఆయా వంగడాలతో పండించిన ఆహారం తినడం వలన సహజంగా భారతీయ వాతావరణంలో ఉండే వారికి కావాల్సిన ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే ఇన్నాళ్లు తిన్న పసలేని ఆహారం వలన శరీరంలో పేరుకునిపోయిన కొన్ని లోపాలు కూడా నెమ్మదిగా ఈ ఆహారం తీసుకోవడం వలన తగ్గిపోతున్నట్టు కూడా వీళ్లు ఆయా వినియోగదారుల నుండి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

అయితే ఈ సేంద్రియ రైతులు పండించే విధానం ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలని, పెద్దల వ్యవసాయ పద్ధతులు తిరిగి అందరు రైతులు ఆచరించాలనే ఉద్దేశ్యంతో వారివారి వ్యవసాయ భూములలో వంగడాలతోనే అనేక రూపాలు వచ్చే విధంగా విత్తనాలను నాటి, వారి ప్రత్యేకతను ఆయా సామజిక మాద్యమాలద్వారా అందరికి తెలియజేయడంలో సఫలీకృతులు అవుతున్నారు.  తాజాగా దసరా సందర్భంగా ఒక రైతు దుర్గమ్మ రూపాన్ని వంగడాలతో చక్కగా రూపొందించారు. ఇది గుంటూరుకు చెందిన కొల్లిపర మండలం అత్తోటకు చెందిన రైతు బాపారావు తన వ్యవసాయ భూమిలో వేద పద్దతిలో ఏర్పాటు చేశారు. విత్తనం నాటిన రెండు నెలల తరువాత ఈ ఫలితం కనిపించి, అందరిని ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: