ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఎన్నో విషయాలను వెలువరిస్తున్నాయి. మనం సాధారణంగా రోజువారీ చేసే పనుల వల్ల జరిగే మంచి చెడులను వివరిస్తున్నాయి. అయితే మనం కుర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోకపోతే ఇబ్బందులు వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే. కూర్చున్నప్పుడు కాసేపు రిలాక్స్ కోసం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా ఇబ్బందులు తప్పవట.  ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు రెండు కాళ్లు బాగా దగ్గరగా పెట్టి లేదా కాలిపై కాలు వేసుకుని, పాదాలు క్రాస్ చేసి అటూ ఇటూ పెట్టి కూర్చోవడం  అలవాటు. ఆ మాట కొస్తే పురుషుల్లోనూ ఇలా కూర్చునేవారున్నారు.

 

అయితే ఈ క్రాస్ లెగ్ పొజిష‌న్‌లో కూర్చోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా కూర్చుంటే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ సమయం పాటు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే బీపీ పెరిపోతుంది. ఇది గుండె సమస్యలకు మాత్రమే కాదు త్వరగా రక్తం గడ్డకట్టే సమస్య కలిగిన వారికి ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు. ఈ భంగిమలో కూర్చున్నపుడు గుండెకు రక్తం మరింత ఎక్కువ ఒత్తిడితో చేరుతుంది. అందువల్ల గుండె త్వరగా అలసిపోతుంది. ఈ పొజిష‌న్‌లో కూర్చోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలింగా కీళ్ల నొప్పుల స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. కీళ్లు, కండ‌రాల క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉండ‌వ‌ట‌.

 

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే నిబంధన ఒక్క మహిళలకే కాదు. పురుషులకు కూడా వర్తిస్తుందని ఆ డాక్టర్ చెప్పారు. వెన్నెముక‌, మెడ‌, తొడలు, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. శ‌రీర భంగిమ మారుతుంది. స‌రిగ్గా నిల‌బ‌డ‌లేరు, కూర్చోలేరు. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నపుడు పెరోనియల్ నాడి మీద ఒత్తిడి పడుతుంది. ఇది మోకాలు కింది భాగంలో ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పాటు ఈ భంగిమలో కూర్చున్నపుడు పాదాల్లో నొప్పి వస్తుంది. ఇది మీరు భంగిమ మార్చాల్సిన అవసరాన్ని తెలియజేసే సూచన అని గ్రహించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డ్రాప్ ఫూట్ అనే సమస్య రావచ్చు. సో.. బీ కేర్ ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: