పార్టీకో, ఫంక్షన్లుకో వెళ్ళాలి అని అందంగా రెడీ అవుతాం. ఉన్న దుస్తుల్లో అందమైనవి వేసుకుంటాం. కొంతమంది అయితే ప్రత్యేకంగా ఆ సందర్బం కోసమే కొత్త బట్టలు కొనుకుంటారు కూడా. ఎందుకంటే మనం కనిపించే తీరుని బట్టి మనకు గౌరవం లభిస్తుంది అన్న ఆలోచన మనది. మరి అంత అందంగా తయారైన మన దగ్గర నుంచి వచ్చే సువాసన కూడా అంతే ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం. దాని కోసమే ప్రతీ ఒక్కరు పెర్ఫ్యూమ్ లేదా బాడీ స్ప్రే లను వాడుతున్నారు. ఎంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ వాడితే అంత గౌరవంగా భావించేవారు ఉన్నారు. కాని ఇలా తరచూ పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్ వాడటం వాల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.....

 

రోజు పెర్ఫ్యూమ్స్ , బాడీ స్ప్రేస్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది అంటున్నారు నిపుణులు. రసాయనాలతో తయారైన సెంట్, పెర్ఫ్యూమ్ చర్మం మీద స్ప్రే చేయటం వల్ల స్కిన్ ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉందట. మార్కెట్ లో రకరకాల పువ్వుల పేర్లతో ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్  విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మంచి సువాసన కోసం ప్రజలు వాటిని వాడుతున్నారు. కాని ఇలా పెర్ఫ్యూమ్స్  వాడేవారిలో 2శాతం మంది విష ప్రభావాలకి గురి అవుతున్నట్టు పరిశోధనలో తేలింది అంటున్నారు శాత్రవేత్తలు.

 

అంతేకాదు వారి పరిశోధలో ఇంకొన్ని ఆశ్చర్యపోయే నిజలు కూడా తెలిశాయట. పెర్ఫ్యూమ్స్ అలవాటు ఉన్నవారికి ఎక్కువ శాతం డిప్రెషన్ సమస్య పెరుగుతోంది అంటున్నారు శాత్రవేత్తలు. ఈ సమస్య రోజురోజుకు పెరిగి వైద్యానికి కూడా అందనంత లోతుకు వెళ్తుందని వివరించారు.ఇన్ని దుష్ప్రబవాలు చూపే సెంట్ పెర్ఫ్యూమ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకని వారి సూచల మేరకు వీలైనంత వరకు రసాయనకర పెర్ఫ్యూమ్స్, సెంట్స్ కి దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈరోజుల్లో అనారోగ్యం పాలై లక్షలకు లక్షలు డబ్బు ఆసుపత్రి పాలు చేసేదానికంటే కూడా సువాసనవెదజల్లే రసాయానిక సెంట్లకి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: