చిరు ధాన్యాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి.. కానీ వల్ల మానవ శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు, లవణాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. బిపి, షుగర్ ఉన్న ఎక్కువగా ఈ చిరు ధాన్యాలను తింటారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఎక్కువగా వీటినే తీసుకుంటారు. ఈ చిరు ధాన్యాలు ఆరోగ్యానికే కాకుండా స్థూలకాయులు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. అందుకే రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామంది వంటిళ్లలో దర్శనమిస్తున్నాయి.



ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్‌లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో ఈ చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వీటిలో మేలురకం పిండి పదార్థాలు ఉండటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా అవ్వడానికి కూడా ఈ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అందుకే అధిక బరువును కూడా అదుపులో ఉంచుతుంది. ఎముకల బలానికి కూడా ఈ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎముకల పుష్టికి కూడా తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి.


ఈ ధాన్యాలను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..


సజ్జల్లో ఫాస్ఫరస్‌ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 296 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్‌ ఉంటాయి.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల రాగుల్లో 244 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, ఎముకలు విరిగిపోయే ముప్పు తగ్గుతుంది.

అందుకే రాగులు, సజ్జలను ఆహారంలో విధిగా చేర్చుకోవటం మంచిదని ఆయుర్వేద వైద్యులు వెల్లడించారు. రాగి, సజ్జ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. రాగులు జావ కాచుకొని తాగొచ్చు. రాగి జావలో కొంచెం బెల్లం కలిపితే చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడతారు.m


చూసారుగా చిన్నగా ఉన్న ఈ ధాన్యాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: