జీవితం అంటేనే ఎంతో మంది కలయిక.. జీవితం కొనసాగించే సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే, మరోపక్క మన దారికి ఎదురైన ప్రతి ఒక్కరిని కలవాల్సి ఉంటుంది. మధ్యలో తెలిసిన వాళ్లు మనకు స్నేహితులుగా మారతారు. మన ప్రవర్తన, అభిరుచులు నచ్చినప్పుడు వారు మనతో స్నేహం చేయడానికి ముందుకు వస్తారు. కొంత మంది స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.. ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఇప్పుడు చెప్పబోయే కొన్నిరకాల వ్యక్తిత్వం కలిగిన స్నేహితులను ఎప్పుడు దూరం చేసుకోకండి.

మీరు ఏం చేసినా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండి, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే  మిత్రులను ఎప్పుడు దూరం చేసుకోకండి. ముఖ్యంగా వారు మిమ్మల్ని ఏమన్నా సరే పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది.. ముఖ్యంగా ఏదైనా సందర్భాలలో వారి పై మీరు ఆధారపడాల్సి వస్తుంది. లేదా మీరు కోరుకున్న జీవితం ఎంత ముఖ్యమో వారు అర్థం చేసుకునే వారు అయితే ఖచ్చితంగా అలాంటి మిత్రులను ఎప్పటికీ దూరం చేసుకోకండి.

ప్రపంచంలో మనం చెప్పే మాట వినే వాళ్ళ కంటే హితబోధ చేసే వారే ఎక్కువ. ఒకవేళ మీ మిత్రులు కనుక మీరు చెప్పేది శ్రద్ధగా వింటే.. అలాంటి వారిని ఎప్పుడు గౌరవించండి. ఎందుకంటే వారు మీ నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ప్రతి మాట నీ మాటే నెగ్గాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకుండా వుండడమే మంచిది.

మీ పరిస్థితి ఒక్కో సమయాలలో చాలా అగమ్యగోచరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాలలో మీకు సహాయం చేస్తామంటూ వచ్చే వారే నిజమైన స్నేహితులు. వారిని లొంగదీసుకోవడం మహాపాపం. ఇక చివరికి అన్నీ పోగొట్టుకున్నా మిగిలేది వాళ్లే కాబట్టి వారు మిమ్మల్ని అర్థం చేసుకునే సమయంలో వారిని మీరు దగ్గరకు చేర్చుకోవడం చాలా మంచిది.

జీవితంలో ఎప్పుడు మొఖం మీద మాట్లాడే స్నేహితులను అసలు దూరం చేసుకోవద్దు.. వేరు చేసి తప్పులను ఎత్తి పొడిచినంత మాత్రాన వారు శత్రువులు కారు. ఇలాంటి స్నేహితులు మీకు జీవితంలో ఎదురయితే అసలు వదులు కోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: