రాత్రిపూట కొన్ని మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడం సులభంగా సాధ్యమవుతుంది. ఇవి మీ మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి గడియల్లో ఎక్కువగా తినకూడదు. ఎప్పటికీ తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్లు కలిగిన భోజనాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు: ఓట్స్, రాగి జావ, పాలకూర పప్పు, ఉడకబెట్టిన కూరగాయలు, సూప్ వెజ్/చికెన్, చపాతీతో పచ్చడి, రాత్రి 7-8 గంటల మధ్యలో భోజనం పూర్తి చేయండి. భోజనానికి 2-3 గంటల తర్వాత నిద్రపోతే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అప్పుడు కొవ్వుగా నిల్వపడే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆలస్యంగా భోజనం చేస్తే శరీరంలో కొవ్వు నిల్వ పడుతుంది. రాత్రిపూట చాలా ఎక్కువ నీరు త్రాగితే అది నిద్రపై ప్రభావం చూపుతుంది. కానీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని భోజనం తర్వాత తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. టాక్సిన్స్ తొలగించేందుకు బాగా సహకరిస్తాయి. రాత్రిపూట స్క్రీన్ టైమ్ ఎక్కువైతే నిద్రపై ప్రభావం పడుతుంది. నిద్ర లోపం బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. కాబట్టి నిద్రకు ముందు కనీసం 30 నిమిషాలు స్క్రీన్‌ల నుండి దూరంగా ఉండండి. దీర్ఘ శ్వాస తీసుకోవడం,

ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. హార్మోన్‌ల సమతుల్యత మెరుగవుతుంది, ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర లేని వారు ఎక్కువ ఆకలి వేస్తుంది, ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత బాగుండి, మెటబాలిజం సక్రమంగా పని చేయాలంటే మంచి నిద్ర అవసరం. రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నెమ్మదిగా నడవండి. జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది. నిద్ర బాగా పడేలా చేస్తుంది. నిద్రకి నిర్దిష్టమైన సమయం నిర్ణయించుకొని దాన్ని పాటిస్తే హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. హార్మోన్ల బ్యాలెన్స్ బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: